టాలీవుడ్ హల్క్ హీరో రానా నటించిన తాజా చిత్రం “అరణ్య”. ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం గత ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వలన వాయిదా పడాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో విడుదలకు రెడీ అయిన మిగతా సినిమాలతో పాటు ఈ చిత్రానికి కూడా ఓటిటి సెగ తగిలింది.
ఆ రేస్ లో ఉన్నవన్నీ ఎలాగో మీడియం బడ్జెట్ సినిమాలు కావడంతో పలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కోనేసేందుకు ముందుకొచ్చాయి. ఈ పరిస్థితుల్లో తమిళ్ ఇండస్ట్రీ వారు సినిమాలు వారికి ఇచ్చేసారు కానీ మన వాళ్ళు మాత్రం ఇవ్వలేదు. అనుష్క నటించిన “నిశ్శబ్దం” మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన “ఉప్పెన” లు డైరెక్ట్ స్ట్రీమింగ్ లోకి వచ్చేస్తాయని అనేక రూమర్స్ వచ్చాయి.
కానీ వాటని చిత్ర నిర్మాణ సంస్థలు కొట్టి పడేశాయి. అయితే ఇప్పుడు “అరణ్య” సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు కొనేశారని డైరెక్ట్ ఇక అందులోనే విడుదల అని ఓ టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని ఈ చిత్రం డైరెక్ట్ గా థియేటర్స్ లోనే విడుదల కానుంది అని తెలుస్తుంది.
0 Comments