Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

వకీల్ సాబ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా కోర్టు సెట్

వకీల్ సాబ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా కోర్టు సెట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఈ కరోనా మహమ్మారి లేకుండా ఉండి ఉంటే ఈ పాటికి సినిమా షూటింగ్ పూర్తయ్యేది. కానీ లాక్ డౌన్ కారణంగా 80 శాతం వద్ద ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. లాక్ డౌన్ ముగియగానే షూట్ తిరిగి మొదలుపెట్టాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా కోర్టు సెట్ వేసి మిగిలిన షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఇక ఈ సినిమా ఓ ఫైట్ మీద అవుతుందట. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సీన్ ఫైట్‌ కావడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే విషయమే.
అలాగే ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ లో చాలానే మార్పులు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సామాజిక సందేశం ఉన్న సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు. అన్నట్టు ప్రెజెంట్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ను అందిస్తున్నాడు.

Post a Comment

0 Comments