కమెడియన్ మరియు నిర్మాత అయిన బండ్ల గణేష్ దీనిబారిన పడ్డారని సమాచారం. నిన్న సాయంత్రం నుండి ఈ వార్త పరిశ్రమలో కలకలం రేపుతోంది. మూడు నెలలగా కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తుంది. లాక్ డౌన్ సడలింపుల అనంతరం దీని బాధితుల సంఖ్య మరింత ఎక్కువ అయ్యింది. ఐతే ఇంత వరకు టాలీవుడ్ లో ఒక్కరి కూడా కరోనా సోకిన దాఖలాలు లేవు.
మొదటిసారి బండ్ల గణేష్ కి కరోనా అంటూ కలకలం రేగింది. బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కొరకు ఓ క్లినిక్ కి వెళ్లగా, వారు మొదట కరోనా టెస్ట్ చేయాలని చెప్పారట. బండ్ల గణేష్ కి కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని సమాచారం. దీనితో ఆయన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు కరోనా టెస్ట్స్ చేయించుకుంటున్నారట. ఐతే ఈ విషయాన్ని, బండ్ల గణేష్ ఖండించినట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తలలో నిజం ఎంతో తెలియాలంటే కొంత సమయం పట్టేలా ఉంది.
0 Comments