ప్రపంచ రక్త దాన దినోత్సవం రోజున మెగాస్టార్ చిరంజీవి ఓ ఎమోషనల్ మెస్సేజ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఒక మనిషి ప్రాణం కాపాడడం కంటే సంతృప్తిని ఇచ్చే విషయం వేరొకటి ఏముంటుంది. ఏళ్లుగా రక్తదానం చేసి ప్రాణాలు దానం చేస్తున్న దాతలందరికీ నా ధన్య వాదాలు అని ఆయన తెలిపారు. సామాజిక స్పృహ కలిగిన చిరంజీవి చాలా ఏళ్ల క్రితమే రక్త దాన ప్రాధానత్య గుర్తించారు. అందుకే ఆయన 1998లో బ్లడ్ బ్యాంకు స్థాపించారు.
ఏళ్లుగా చిరంజీవి తన ఫ్యాన్స్ మరియు, అనేక మంది వాలంటీర్ల నుండి రక్తం సేకరించి ఆపదలో ఉన్న అనేక మంది రోగులకు, క్షతగాత్రులకు దానం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి తన జీవిత కాలంలో అనేక మార్లు రక్త దానం చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి నిర్మాతగా ఉన్న చరణ్ కూడా ఈ చిత్రంలో కీలక రోల్ చేయడం విశేషం.
0 Comments