Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఫాన్స్ కి మరో గిఫ్ట్ ఇవ్వనున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణకు ఈ పుట్టిన రోజు చాలా ప్రత్యేకం. ఆయన 60వ వసంతంలోకి ఈ ఏడాది ప్రవేశించారు. ఈ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని అభిమానులు భావించినా… కరోనా వైరస్ కారణంగా అది కుదరలేదు. ఇక బాలకృష్ణ సైతం తనను కలవడానికి ఎవరూ రావద్దని ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు. ఐతే ఫ్యాన్స్ కోసం ఈ సారి తానే వస్తున్నాను అని బాలయ్య ప్రకటించారు. బాలకృష్ణ నేడు పేస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించనున్నారు. వాళ్ళు అడిగే అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు. నేడు సాయంత్రం 4:30 నిమిషాలకు ఈ కార్యక్రమం మొదలుకానుంది.
ఎప్పుడూ లేనిది బాలయ్య ఇలా సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులోకి రానున్నాడు. ఇక బాలయ్య పుట్టిన రోజు కానుకగా నిన్న విడుదలైన ఆయన నూతన చిత్ర టీజర్ కి విశేష ఆదరణ దక్కింది. బాలయ్య లుక్, ఆయన చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

Post a Comment

0 Comments