Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ట్రేండింగ్ లో బాలయ్య టీజర్

ట్రేండింగ్ లో బాలయ్య టీజర్
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమా నుండి బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా ‘బీబీ3 ఫస్ట్ రోర్’ పేరుతో విడుద‌ల‌ చేసిన టీజ‌ర్ ఇప్ప‌టికే 10 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్‌ ని క్రాస్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో నెం.1 ట్రెండింగ్‌ లో ఉండటం విశేషం.
బాక్సాఫీస్ వద్ద పడిపోయిన బాల‌కృష్ణ మార్కెట్ ను ‘బీబీ3 టీజ‌ర్ తిరిగి నిలబెట్టింది. మొత్తానికి బాలయ్య రేంజ్ ను గుర్తు చేసింది. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చాలా పెద్ద స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్స్ మ‌ళ్ళీ స్టార్ట్ అయ్యాక ఈ సినిమాను రెట్టింపు వేగంతో పూర్తి చేయనున్నారు. ఈ చిత్రానికి ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారని కూడా టాక్‌ వినిపిస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది. ఇక బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సూపర్ విజయాలను అందించారు బోయపాటి. కాబట్టి ఈసారి కూడా సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Post a Comment

0 Comments