Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఎవ్వరూ చేయని సాహసాన్ని బాలయ్య చేశారు

ఎవ్వరూ చేయని సాహసాన్ని బాలయ్య చేశారు
బాలయ్య బాబు షష్ఠి పూర్తి సంధర్భంగా ఆయన రెండు గిఫ్ట్స్ ఇచ్చారు. అందులో ఒకటి బోయపాటి తో చేస్తున్న మూవీ టీజర్ తో పాటు, ఆయన స్వయంగా పాడిన పాట. బాలకృష్ణ తండ్రి గారైన నందమూరి తారక రామారావు నటించిన జగదేక వీరుని కథ మూవీ లోని ఆల్ టైం ఫేవరేట్ సాంగ్ “శివ శంకరి” సాంగ్ పాడడం జరిగింది. సంగీతంలో ప్రావీణ్యం ఉన్న వారు కూడా పెద్ద ఛాలెంజ్ లా భావించే ఆ క్లిష్టమైన సాంగ్ ని బాలయ్య పాడడం జరిగింది. మరి ఈ పాట పాడాలనుకోవడం వెనుక బాలయ్య ఉద్దేశం ఏమిటనేది ఆయనే పేస్ బుక్ లైవ్ లో అభిమానులతో స్వయంగా పంచుకున్నారు.
శివ శంకరి సాంగ్ పాడడానికి ఎవరూ సాహసించరు. ఆ పాటను పాడడం అంత సులభం కాదని వారికి తెలుసు. ఎవరూ చేయని సాహసం కాబట్టి నేను చేశాను, అన్నారు. ఇక నేను అద్భుతంగా పాడకపోయినా పాడాలనిపించి పాడాను అన్నారు. ఇక గతంలో బాలయ్య దర్శకుడు పూరి తెరకెక్కించిన పైసా వసూల్ మూవీలో “మా ఏక్ పెగ్ లా” సాంగ్ పాడడం జరిగింది.

Post a Comment

0 Comments