బుధవారం జూన్ 10 వ తారీఖు తో నటుడు నందమూరి బాలకృష్ణ కి 60 ఏళ్లు నిండనున్నాయి. అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి లో బాలకృష్ణ తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్కడ తల్లి దండ్రుల విగ్రహాలకు బాలకృష్ణ పుల మాలలను వేసి నివాళులు అర్పించారు. అయితే అక్కడ చిన్నారులతో కలిసి బాలకృష్ణ కేక్ కట్ చేశారు. ఈ అయితే బాలకృష్ణ కి అక్కడి సిబ్బంది తో సహా పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. తన అభిమానులు, ప్రేక్షకుల వలనే తాను ఈ స్థాయిలో ఉన్నారు అని వ్యాఖ్యానించారు. నాకు అపుడే 60 ఏళ్లు వచ్చాయంటే నమ్మశక్యం గా లేదు అని బాలకృష్ణ అన్నారు. 6 ఏళ్ల వయసు లోనే హైదరాబాద్ కి వచ్చా అని తెలిపారు. అయితే బసవ తారకం లో ఇపుడు పరిస్తితి బావుంది అని, ఎంటో మంది దాతలు సహాయం చేస్తున్నారు అని అన్నారు. అంతేకాక ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి త్వరలో మనల్ని వీడి పోవాలి అని, అందరూ కరోనా వైరస్ భారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని వ్యాఖ్యానించారు.
0 Comments