Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

బోయపాటి తర్వాత బి.గోపాల్ తో మూవీ చేయనున్న బాలయ్య

బోయపాటి తర్వాత బి.గోపాల్ తో మూవీ చేయనున్న బాలయ్య
బాలయ్య రైతు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. బాలయ్య – బి.గోపాల్ సూపర్ హిట్ కాంబినేషన్ లో ఈ సినిమా ఉంటుందని బాలయ్య శైలిలోనే సినిమా సాగుతూ కాస్త కొత్తగా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకుందట. ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ రాస్తున్నారు.
మరి సాయి మాధవ్ బుర్రా బాలయ్య కోసం పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రాశాడట. నిజానికి ఈ సినిమా క్యాన్సల్ అయినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు అవాస్తవం అని తెలుస్తోంది. బాలయ్య – బి.గోపాల్ కాంబినేషన్ సినిమా వస్తోంది. బాలయ్య కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు బి.గోపాల్ డైరెక్ట్ చేసినవే. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోన్న బాలయ్య, పూరితో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments