Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ప్రేక్షకులకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వనున్న బాలయ్య

ప్రేక్షకులకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వనున్న బాలయ్య
నటసింహ నందమూరి బాలకృష్ణ వయసు పెరిగే కొద్దీ ఇంకా యంగ్ అయిపోతున్నారు. తన 60వ జన్మదినం సందర్భంగా ఒక అపురూపమైన పాటతో ప్రేక్షకాభిమానులను అలరించబోతున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలయ్య ఈ పాట గురించి చెప్తూ.. ‘ఓ పాట ప్రయత్నిస్తున్నాను. అంటే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎక్కువ సేపు వెయిట్ చేయించను. తొందర్లోనే సోషల్ మీడియాలోకి వదుల్తాను’ అని ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. బాలయ్య మాటలను బట్టి సాంగ్ పై బాలయ్య ఎప్పటినుండో ప్రాక్టీస్ చేస్తున్నారు. కచ్చితంగా సాంగ్ బాగా వస్తోంది.
దాంతో బాలయ్య అభిమానులు ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఇది సినిమాలో పాట.. లేక ఆధ్యాత్మిక గీతమా..లేదా ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రాయించిన పాటా అని అభిమానుల్లో ఎన్నో సందేహాలు. అయితే బాలయ్య పుట్టినరోజున ఈ నెల 10న ఈ సాంగ్ విడుదల కానుంది. ఇక పాటలు పాడడం బాలయ్యకు కొత్తకాదు. పైసా వసూల్ సినిమాలో “మామా.. ఏక్ పెగ్ లా” అనే పాట పాడారు. అలాగే ఓ స్టేజ్ పై కూడా బాలయ్య పాట పాడిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాలతో పాటు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ పనులతో పాటు, బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్విర్తిస్తూ బిజీ బిజీగా ఉంటారు బాలయ్య. అయినప్పటికీ అభిమానుల కోసం పాట పాడటం గొప్ప విషయం.

Post a Comment

0 Comments