Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

సాయంత్రానికి బాలయ్య నుండి బర్త్డే ట్రీట్

సాయంత్రానికి బాలయ్య నుండి బర్త్డే ట్రీట్
బాలయ్య ఫ్యాన్స్ కి నేడు బిగ్ డే అని చెప్పాలి. వారు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కాంబినేషన్ లో ఆయన మూవీ వస్తుండగా, ఆ చిత్ర ఫస్ట్ అప్డేట్ నేడు రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 106వ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ నేడు రానుంది. దీనిపై ఇప్పటికే సమాచారం ఉండగా ఇవాళ సాయంత్రం 7:09నిమిషాలకు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు.
ఇక ఎప్పటిలాగే బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపించనుండగా వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి స్వయంగా ధ్రువీకరించడం జరిగింది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి. మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Post a Comment

0 Comments