Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

బాలయ్య, బోయపాటి మాస్ టీజర్ విడుదల

బాలయ్య, బోయపాటి మాస్ టీజర్ విడుదల
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ కలిసిందంటే ఎలాంటి బీభత్సం సృష్టిస్తారనేది సింహా, లెజెండ్ సినిమాల ద్వారా తెలిసిపోయింది. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా కూడా రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాపై ప్రేక్షకులలో కూడా భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి.
అయితే తాజాగా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం BB3 టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్‌లో కూడా బోయపాటి మార్క్ మరోసారి కనిపించింది. పంచెకట్టులో బాలయ్యకు తగ్గట్టుగానే అదిరిపోయే ఎంట్రీతో, పవర్‌పుల్ డైలాగ్‌తో అభిమానూలలో గూస్‌బంప్స్ క్రియేట్ చేశాడు. చాలా రోజులు వెయిట్ చేసిన బాలయ్య ఫ్యాన్స్ ఈ BB3 ఫస్ట్ రోర్ చూసి కాలర్ ఎగరేస్తున్నారు.

Post a Comment

0 Comments