Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

బాలయ్య అఘోర గెటప్ పై అందరి డౌట్

బాలయ్య అఘోర గెటప్ పై అందరి డౌట్
ఒక్కటీజర్ తోనే ఈసారి ఫ్యాన్స్ కి భారీ విజయం బహుమతిగా ఇవ్వబోతున్నాం అని బాలయ్య మరియు బోయపాటి శ్రీను ధ్రువీకరించారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ గత రెండు చిత్రాలకు మించి ఉంటుదన్న నమ్మకం ఫ్యాన్స్ లో కలిగింది. ఇక బాలయ్య సైతం సినిమా బాగా వస్తుందని, మంచి విజయం సాధించడం ఖాయం అని ఫ్యాన్స్ ఎదుట ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
కొంత నిడివి కలిగిన ఓ పాత్రలో బాలయ్య అఘోరాగా కనిపిస్తారని దర్శకుడు బోయపాటి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఎపిసోడ్ ఎలా ఉంటుంది? బాలయ్య అఘోరాగా మారడానికి కారణం ఏమిటీ? అసలు ఆ పాత్ర నేపథ్యం ఏమిటనేది? ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులలో నెలకొన్న ప్రశ్న. అందరూ కన్విన్స్ అయ్యేలా అద్భుత నేపథ్యంతో ఈ పాత్ర ఉంటుంది అని బోయపాటి చెవుతుండగా ఫ్యాన్స్ కూడా ఆసక్తితో ఉన్నారు. ఇక మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

Post a Comment

0 Comments