Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇష్టమైన వారితో ఉండేందుకు ప్రయత్నించాలి

డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇష్టమైన వారితో ఉండేందుకు ప్రయత్నించాలి
డిప్రెషన్ కారణంగా హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకొని ప్రాణాలు వదిలిన నేపథ్యంలో.. హీరోయిన్ అనుష్క ఈ ఘటనపై స్పందించింది.సోషల్ మీడియా ద్వారా అనుష్క డిప్రెషన్ నుండి బయటపడే మార్గాలు సూచించింది. సెలబ్రెటీ అయినా సామాన్యుడు అయిన కూడా కష్టాలు కన్నీరు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ పరిస్థితుల నుండి బయట పడేందుకు ప్రయత్నించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరి జీవితం ఫర్ ఫెక్ట్ గా లేదు. ప్రతి ఒక్కరు కూడా కష్టాలను ఎదుర్కోవాల్సిందే. జీవితంలో ఏం జరిగినా సానుకూల దృక్పదంతో ముందుక సాగాలి తప్ప, జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవాలనే నిర్ణయం తీసుకోవడం తప్పు అన్నారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ డిప్రెషన్ లో ఉన్న సమయంలో ఇతరులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా మనకు ఇష్టమైన వారు, ఆనందం పంచే వారు దగ్గిర ఉండేలా చూసుకోవాలి అన్నారు. ఎదుటి వారు ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా వారిని చూసి చూడనట్లుగా వదిలేయకుండా వారితో సమయంను గడిపేందుకు ప్రయత్నించండి. తోటివారు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్లయితే వారిపై మానవత్వం ప్రదర్శించినప్పుడే వారు డిప్రెషన్ నుండి బయట పడగలరు అంటూ అనుష్క చెప్పారు.

Post a Comment

0 Comments