యంగ్ డైరెక్టర్ సుజీత్ ఇటీవల తన గర్ల్ ఫ్రెండ్ ప్రవల్లికతో నిశ్చితార్ధం చేసుకున్నారు. డాక్టర్ ప్రవల్లిక మరియు సుజీత్ కొంత కాలంగా ప్రేమించుకుంటూ ఉండగా, పెద్దల అనుమతితో పెళ్ళికి సిద్ధం అయ్యారు. వీరి నిశ్చితార్ధం జరిగినా పెళ్లికి మాత్రం చాలా సమయం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సుజీత్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ మూవీ కమిట్ అయ్యారు. మలయాళ హిట్ చిత్రం లూసిఫర్ తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకున్న రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో ఈ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ స్క్రిప్ట్ పై పనిచేస్తున్న సుజీత్, వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. కాగా ఈ మూవీ పూర్తి అయిన తరువాతనే పెళ్లి చేసుకుంటానని సుజీత్ కుటుంబ సభ్యులకు తెలిపారట. అందుకు వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. దీనితో ఆయన వివాహం 2021 చివర్లో ఉండే అవకాశం కలదు. గత ఏడాది ఆయన ప్రభాస్ తో చేసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో మిశ్రమ ఫలితం అందుకుంది.
0 Comments