తన కెరీర్ ని సల్మాన్ ఖాన్ కుటుంబం నాశనం చేసిందన్న అభినవ్ కశ్యప్ ఈ సారి సల్మాన్ ఖాన్ చారిటీ సంస్థ బీయింగ్ హ్యూమన్ ని టార్గెట్ చేశారు. ఆ సంస్థ ద్వారా సల్మాన్ అక్రమాలకు పాల్పడుతున్నాడని అనుమానం వ్యక్తం చేశాడు. సల్మాన్ ఖాన్ తనపై ఉన్న కేసుల నుండి మీడియా దృష్టిని మరల్చడానికి, మాత్రమే ఛారిటీ చేస్తున్నట్లుగా మోసం చేస్తున్నాడు అన్నారు.ఆ కుటుంబం తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీయింగ్ హ్యూమన్ ఛారిటీ సంస్థను ప్రారంభించారని అభినవ్ ఫైర్ అయ్యారు.
కేవలం పబ్లిసిటీ కోసమే బీయింగ్ హ్యూమన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.పబ్లిసిటీతో పాటు ఆర్థికం నేరాలకు కూడా సల్మాన్ ఖాన్ కు ఆ ఛారిటీ సంస్థ ఉపయోగపడుతున్నాయి అన్నారు. అభిమానం అనేదానిని ఉపయోగించుకుని సల్మాన్ ఖాన్ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఎవరు కూడా బీయింగ్ హ్యూమన్ ద్వారా సాయం పొందవద్దు. ప్రభుత్వం సల్మాన్ ఛారిటీ కార్యక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలంటూ దర్శకుడు అభినవ్ డిమాండ్ చేశాడు.
0 Comments