కరోనా కారణంగా సంక్షోభం ఏర్పడిన నాటి నుండి నిర్మాతలలో గుబులు మొదలైంది. థియేటర్స్ బంధ్ కారణంగా తమ చిత్రాల విడుదల విషయంలో సందిగ్దములో ఉన్నారు. కొందరు సాంప్రదాయ థియేటర్స్ విడుదలకు మొగ్గు చూపుతుంటే, కొందరు ఓ టి టి విడుదల బెటర్ అంటున్నారు. ఐతే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా హీరోయిన్ రకుల్ ప్రీత్ ని అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పారు.
ఆమె మాట్లాడుతూ…’సినిమాలను ఏ ప్లాట్‌ఫామ్ మీద విడుదల చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ, కొన్ని సినిమాలను థియేటర్లలో చూస్తేనే బాగుంటుంది. ఎలా విడుదల చేయాలనే దాని గురించి నిర్మాతలే నిర్ణయం తీసుకోవాలి. సినిమాపై పెట్టుబడి పెట్టేది నిర్మాత. డిజటల్‌లో విడుదల చేయడమే సరైన నిర్ణయం అని నిర్మాతలకు అనిపిస్తే.. వారి కంటే బాగా నిర్ణయాలు తీసుకోగలిగిన వారెవరు?` అని రకుల్ పేర్కొంది. వారి పెట్టుబడికి రాబడి రావడం ముఖ్యం కాబట్టి అందుకు అనుగుణంగా నిర్మాతలు నిర్ణయం తీసుకుంటే బెటర్ అన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్త పరిచారు.
0 Comments