Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

ఇలా ఎన్ని రోజులు సింగిల్ గా ఉంటావో నేను చూస్తా – నితిన్

ఇలా ఎన్ని రోజులు సింగిల్ గా ఉంటావో నేను చూస్తా – నితిన్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. చిత్తలహరి, ప్రతి రోజూ పండగే చిత్రాల తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం విడుదల ఆగిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం నుండి నో పెళ్లి అనే పాటను హీరో నితిన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. అయితే ఈ పాటలో రానా, వరుణ్ తేజ్ లు ఇద్దరూ కూడా ఉండటం విశేషం.
అయితే ఈ చిత్రం లోని పాటను విడుదల చేస్తూ హీరో నితిన్ సాయి ధరమ్ తేజ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నో పెళ్లి అంటూ చాలా మంది తమ అభిప్రాయాలను తెలుపుతూ ఉన్నారు. అయితే అదే తరహాలో ఈ పాట కొనసాగుతూ ఉంది. అంతేకాక ఇటీవల రానా కూడా పెళ్లి చేసుకొనేందుకు సిద్దం అవుతున్నారు. అయితే సాయి నీ ఉద్దేశించి నితిన్ ఇలా వ్యాఖ్యానించారు. నేను చూస్తా ఇలా ఎన్ని రోజులు సింగిల్ గా ఉంటావో, కొన్ని సార్లు చేసుకోవడం లో టైమ్ గ్యాప్ ఉంటుంది.కానీ చేసుకోవడం మాత్రం పక్కా అని అన్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

Post a Comment

0 Comments