Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

నాని మరియు సుధీర్ “వి” సినిమా అందుకే డిజిటల్ గా రాలేదు

నాని మరియు సుధీర్ “వి” సినిమా అందుకే డిజిటల్ గా రాలేదు
నాచురల్ స్టార్ మొట్టమొదటిసారి ఒక యాంటీ హీరోగా సుధీర్ బాబు మరో హీరోగా తెరకెక్కిన తాజా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “వి”. ఈ ఏడాది ఉగాది కానుకగా విడుదలకు రెడీ అయ్యిన ఈ చిత్రం కరోనా వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజుకు స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు భారీ ఆఫర్ ను ఇచ్చినట్టుగా తెలిసింది.
కానీ అనూహ్యంగా నిర్మాత దిల్ రాజు ఆ భారీ ఆఫర్ ను తిరస్కరించారు. అయితే అందుకు గల కారణం ఏమిటి అన్నది ఇప్పుడు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. స్వతహాగా నిర్మాతగానే కాకుండా దిల్ రాజు ఒక డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా ఓ సినిమా థియేటర్ లో రాకుండా ఇలా నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వస్తే తానే ఇలా చెయ్యడం భావ్యం కాదని వి సినిమాను డిజిటల్ గా తీసుకొచ్చేందుకు ఇష్టపడలేదని టాక్.

Post a Comment

0 Comments