Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

వరుణ్ తేజ్ కెరీర్ కోసం నాగబాబు సూపర్ ప్లాన్

వరుణ్ తేజ్ కెరీర్ కోసం నాగబాబు సూపర్ ప్లాన్
మెగా హీరో వరుణ్ తేజ్ డిసెంట్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పటివరకు వరుణ్ తేజ ఖాతాలో హిట్ లు ఉన్నప్పటికీ ఇండస్ట్రీ హిట్ కొట్టిన దాఖలాలు లేవని చెప్పాలి. అయితే వరుణ్ తేజ్ కెరీర్ కోసం నాగబాబు మెగా ప్లాన్ రెడీ చేశారు. అయితే ఇప్పటికే చాలా మంది హీరోలు తమిళ్ లో, బాలీవుడ్ లో విజయం సాధించిన హిట్ సినిమాలను రీమేక్ చేస్తూ ఉండటం చూశాం. అయితే మెగా స్టార్ చిరంజీవి గతం లో నటించి బ్లాక్ బస్టర్ అయిన చిత్రాల్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా నటుడు నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్ కొదమ సింహం లేదా విజేత చిత్రంలో నటిస్తే చూడాలని వుంది అని వ్యాఖ్యానించారు.ఈ రెండు చిత్రాలు కూడా చిరు కి చాలా పెద్ద విజయాలు. అంతేకాక వీటి తో చిరు క్రేజ్ మరింతగా పెరిగింది.అయితే ఈ రెండు చిత్రాలను చేయడం అంటే వరుణ్ కు కూడా చాలా సాహసం అని వ్యాఖ్యానించారు. మరి ఈ చిత్రాలు రీమేక్ చేసే అవకాశం వస్తుందో లేదో చూడాలి.

Post a Comment

0 Comments