Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

సర్కారు వారి పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్

సర్కారు వారి పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్
అనుకున్నట్లుగానే మహేష్ తన ఫ్యాన్స్ కి కోరుకున్న గిఫ్ట్ ఇచ్చే చేశారు. కొన్ని నెలలుగా వారి నిరీక్షణకు తెరదించుతూ కొత్త మూవీ ప్రకటన చేశారు. నేడు ఉదయం 09:09 నిమిషాలకు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. నేడు మహేష్ తండ్రిగారైన కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని మహేష్ కీలక ప్రకటన చేశారు.
ముందుగా ప్రచారం అయినట్టు ఈ మూవీకి సర్కారు వారి పాట అనే టైటిల్ నిర్ణయించారు. చెవికి ఫోగు, మెడపై రూపాయి నాణెం టాటూ తో మహేష్ సరికొత్త లుక్ అదిరింది. మహేష్ ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ అలాగే 14 రీల్స్ కలిసి నిర్మించనున్నాయి.
మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. టోటల్ గా మహేష్ ఫ్యాన్స్ కు ఇది కదా కావాల్సిన అసలు ఎమోషన్ అని చెప్పక తప్పదు.

Post a Comment

0 Comments