Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

కేజీఎఫ్ చాప్టర్ 2 లో కీలకంగా మారిన క్లైమాక్స్

కేజీఎఫ్ చాప్టర్ 2 లో కీలకంగా మారిన క్లైమాక్స్
కేజీఎఫ్ చాప్టర్ 1 తో సినిమా రంగం లో పెను ప్రకంపనలు సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రతి సన్నివేశాన్ని పతాక స్థాయిలో చూపించారు. తల్లి కి ఇచ్చిన మాట కోసం ధనవంతుడిగా, శ్రీమంతుడు గా మారతాడు. అంతేకాక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కి గరుడ ను చంపి, మాఫియా డాన్ గా అవతరిస్తాడు రాఖీ భాయ్. అయితే ఈ చిత్రానికి కొనసాగింపు గా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 లో ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.
రాఖీ భాయ్ తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత, రవీనా టాండన్ హీరో రాఖీ భాయ్ పై సూట్ అండ్ సైట్ ఆర్డర్ ను జారీ చేస్తుంది. అయితే ఈ చిత్రం లో రవీనా టాండన్ సైన్యం రాఖీ భాయ్ నీ క్లైమాక్స్ లో చంపేస్తుంది అట. క్లైమాక్స్ లో రాఖీ భాయ్ చనిపోవడం తో కథ విషాదాంతం కానుంది. అయితే ఇదే విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో సైతం వైరల్ గా మారింది. ఈ చిత్రం లో అధీరా పాత్ర మెయిన్ విలన్. ఇందుకోసం సంజయ్ దత్ ను తీసుకున్నారు ప్రశాంత్ నీల్. హీరో కి సమానంగా ఉండే ఈ పాత్రకు చాలా వెయిట్ ఎక్కువ. అయితే దర్శకుడు వీరిద్దరి మద్య వచ్చే సన్నివేశాల్ని ఎలా చిత్రీకరించారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో, ఇపుడు భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వారు, భాషల వారు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Post a Comment

0 Comments