Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

కీర్తి సురేష్ మిస్ ఇండియా సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లోనే

కీర్తి సురేష్ మిస్ ఇండియా సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లోనే
మహానటి చిత్రం తర్వాత హీరోయిన్ కీర్తి సురేష్ కు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చెయ్యడం మొదలు పెట్టారు. అలా చేసిన కీర్తి సురేష్ ఒక పక్క హీరోయిన్ గానే కాకుండా మంచి ఇలా ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా పలు ఛాలెంజింగ్ రోల్స్ తీసుకుంటూ వచ్చారు. అదే కోవలో చేసిన తాజా చిత్రమే “పెంగ్విన్”.
కరోనా ప్రభావం వలన ఈ చిత్రం డిజిటల్ గా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేయనుంది. వచ్చే జూన్ మాసంలో అమెజాన్ ప్రైమ్ వారు ఈ చిత్రాన్ని వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా స్ట్రీమింగ్ కు తీసుకు రానుండగా ఇప్పుడు మరో తాజా చిత్రం తాలూకా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారే సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.
అదే కీర్తి సురేష్ నటిస్తున్న మరో తాజా చిత్రం “మిస్ ఇండియా”. ఈ సినిమా హక్కులను కూడా అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకోగా దానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది అని తెలుస్తుంది.

Post a Comment

0 Comments