ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో రాకపోవడం ఫ్యాన్స్ ని బాగా నిరాశపరించిన అంశం. లాక్ డౌన్ మొదలయ్యే నాటికే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ 70శాతానికి పైగా కంప్లీట్ కావడంతో పాటు, లాక్ డౌన్ లో రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారన్న వార్తలు రావడంతో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని పరిచయం చేస్తారు అనుకున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న ఎలాంటి ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయడం లేదని ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.
ఐతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనానికి ఎంత త్వరగా అడ్డుకట్ట వేస్తే అంత బెటర్ అని రాజమౌళి భావిస్తున్నారట. అందుకే ఆయన షూటింగ్ మొదలుకాగానే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో తేవాలనే ఆలోచనలో ఉన్నారట. గతంలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం సరిపడా షూటింగ్ మెటీరియల్ లేదని చెప్పిన రాజమౌళి, ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించి ఫస్ట్ లుక్ వీడియో సిద్ధం చేయాలని భావిస్తున్నారట. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ షురూ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక తీరినట్లే. అలాగే ఈ వీడియో కూడా సర్ప్రైజ్ గా విడుదల చేస్తారని సమాచారం.
0 Comments