Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు ఈ టైటిలా

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు ఈ టైటిలా
గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో నందమూరి నటసింహం యువరత్న బాల కృష్ణ హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇవి పక్కన పెడితే బాలయ్య ఇప్పుడు తన బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఒక క్రేజీ టైటిల్ ను పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు “మోనార్క్” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే టైటిల్ ను వచ్చే జూన్ 10 బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఇదే టైటిల్ అయితే ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Post a Comment

0 Comments