Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

చిరంజీవి, రామ్ చరణ్ లకు తప్పిన చిన్నపాటి ప్రమాదం

చిరంజీవి, రామ్ చరణ్ లకు తప్పిన చిన్నపాటి ప్రమాదం
మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఒకే స్క్రీన్ పై కనిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా మెగా ఫామిలీ అంటే అభిమానించే వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ఉన్నారు. అయితే ఈ వార్త వారికి కొద్దిగా షాకింగ్ గానే అనిపించించినా పెద్ద ప్రమాదకరం కాదని తెలుస్తుంది.
ఈరోజు తెలంగాణా జిల్లాలోని దోమకొండ ప్రాంతానికి చిరు చరణ్ మరియు ఉపాసనలు వెళ్లారు. వీరిలో చరణ్ మరియు ఉపాసనల ఫోటోలు బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఓ షాకింగ్ అంశం బయటకొచ్చింది.
వీరితో పాటు చిరు కూడా ఉండగా వారికి ఆ ప్రాంతంలో తేనెటీగల దాడి తగిలిందట. అయితే వాటి దాడిలో చిరు చరణ్ లకు ఏమి కాలేదని చిన్న పాటి గాయాలు కూడా కాకుండా వారు సురక్షితంగానే ఉన్నట్టు సమాచారం.

Post a Comment

0 Comments