ప్రస్తుతం లాక్ డౌన్ మూలాన మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ షూటింగ్ కూడా స్తంభించిపోయింది సంగతి అందరికి తెలిసిందే. దీనితో ఇన్నాళ్ల తర్వాత పరిస్థితులు మెల్లమెల్లగా సర్డుమణుగుతుండడంతో షూటింగ్స్ మరియు థియేటర్స్ తెరిస్తే బాగుంటుంది అన్న ప్రస్తావన మెల్లగా మొదలు కావడంతో..
తెలంగాణా రాష్ట్ర సినిమాటో గ్రఫి శాఖ మంత్రి తలసాని యాదవ్ తో మెగాస్టార్ చిరంజీవి,సహా నిర్మాత అల్లు అరవింద్ మరియు ఇతర అగ్ర నిర్మాతలు హీరోలు మరియు దర్శకులు జరిపిన కీలక మీటింగ్ అనంతరం రెండు రోజుల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని తలసాని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ తో కీలక భేటీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి,త్రివిక్రమ్, N. శంకర్, అల్లు అరవింద్, దిల్ రాజు, రాధాకృష్ణ, C. కళ్యాణ్, సురేష్ బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్, మెహర్ రమేష్, ప్రవీణ్ బాబు తదితరులు ఇపుడు కలవనున్నారని తెలుస్తుంది. ఈ కీలక భేటీ అనంతరం ఏయే నిబంధలతో షూటింగ్స్ మరియు థియేటర్స్ ఓపెన్ అవుతాయి అన్నదానిపై ఒక క్లారిటీ వస్తుంది.
0 Comments