Recent Tube

Trending Now
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లో అమితాబ్ బచ్చన్ గారు | నిశ్శబ్దం రివ్యూ | ఒరేయ్ బుజ్జిగా రివ్యూ | పేదరోగులకు ఉచితంగా COVID ప్లాస్మా - చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు | విజయ్ దేవరకొండ - సుకుమార్ కలయికలో కొత్త మూవీ

Telugu Cinema News, Images, Reviews

అల్లరి నరేష్ 'నాంది' కోసం డబ్బింగ్ మొదలు

అల్లరి నరేష్ 'నాంది' కోసం డబ్బింగ్ మొదలు
అల్లరి నరేష్ ప్రయోగాత్మకంగా చేస్తున్న కొత్త చిత్రం ‘నాంది’. కాగా తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలైయ్యాయి. నరేష్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడట. ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్స్ సినిమా పై విపరీతమైన ఆసక్తిని పెంచాయి.
ఎక్కువగా కామెడీ జానర్లో సినిమాలు చేసే నరేష్ అప్పుడప్పుడు ఇలాంటి ఇంటెన్స్ చిత్రాలను కూడా టచ్ చేస్తుంటారు. గతంలో కూడా ‘నేను, విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం, శంభో శివ శంభో’ లాంటి చిత్రాలతో మెప్పించిన నరేష్ లాంగ్ గ్యాప్ తర్వాత అలాంటి కథతో చేస్తున్న సినిమానే ఈ ‘నాంది’.
ఇందులో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా సామాజిక అంశాలు కూడా ఉండనున్నాయి. మరి గత కొన్ని సినిమాలుగా వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వస్తోన్న అల్లరి నరేష్ ఈ వినూత్నమైన సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సతీష్ వెగేశ్న నిర్మిస్తున్నారు.

Post a Comment

0 Comments